16 May, 2026 | 2:20 AM

పుస్తకం చదవండి సమాజాన్ని వెలిగించండి: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి

16-05-2026 01:36 AM

మహబూబాబాద్, మే15 (విజయక్రాంతి): గ్రంథాలయానికి నిత్యం వెళ్లడం అలవాటుగా చేసుకోవాలని, పుస్తకం చదివి జ్ఞానాన్ని పెంపొందించుకొని మెరుగైన సమాజానికి దోహదపడాలని మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో శుక్రవారం ఐదవ రోజు మహబూబాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పుస్తకం చదవండి జ్ఞానం పెంపొందించుకోండి సమాజాన్ని వెలిగించాలన్నారు. వి ద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని విజ్ఞానాన్ని సంపాదించాలని, మొబైల్ ఫోన్లకు పరిమితం కాకుండా పుస్తకాలతో స్నేహం చేయాలని, మహబూ బాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పాఠకులకు కావలసిన వసతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పాఠకులు తమ సమస్యలను నేరుగా తనకు తెలియజేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి టి శ్రీ లత, డీఈవో సత్యనారాయణమూర్తి, సీనియర్ పాఠకుడు టీవీ రామనర్సయ్య, డిఎ స్‌ఓ అప్పారావు , ఏసీ జీ ఈ మందుల శ్రీరాములు, ఏఎస్ సి సంతోష్, ముక్క లక్ష్మణ రావు, నరసింగ శ్రీనివాస్, జ్ఞానేశ్వర్ గ్రంథపాలకులు, జి విజేందర్, సిహెచ్ రవి, రుద్రారపు వీరేందర్ ,భూలక్ష్మి, యాదమ్మ బాబా, పుస్తక ప్రియులు, పాఠకులు, విద్యార్థిని విద్యార్థులుతదితరులు పాల్గొన్నారు.