20 March, 2026 | 7:56 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

బెంగాల్‌లో దయలేని ప్రభుత్వం

30-05-2025 02:52 AM
  1. ముర్షిదాబాద్, మాల్డా ఘర్షణలు క్రూరత్వ పాలనకు నిదర్శనం
  2. మమతా ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు
  3. ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తవ్వలేదని వెల్లడి

కోల్‌కతా, మే 29: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం మిగిలి ఉండగానే ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతా మధ్య మాటల యుద్ధం మొదలైంది. గురువారం అలీపుర్‌దుర్‌లో  బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇక్కడ ప్రజలపై దయలేని ప్రభుత్వం కొ నసాగుతోందన్నారు ముర్షిదాబాద్, మాల్డాలో చెలరేగిన ఘర్షణలు బెంగాల్ ప్రభుత్వ క్రూరత్వ పాలనకు నిదర్శమని దుయ్యబట్టారు.

మమత ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం లేదన్నారు. ప్రభుత్వాన్ని నడిపేది ఇలాగే నా అని మండిపడ్డారు. బుజ్జగింపు రాజకీయాల పేరిట గూండాలకు స్వే చ్ఛనిచ్చారన్నారు. ఇక్కడ ప్రతి సమస్యకు కోర్టు జోక్యం చేసుకోవాల్సి వ స్తోందని, లేకపోతే ఏదీ పరిష్కారం కాదని మోదీ విమర్శించారు. అనంత రం ఆపరేషన్ సిందూర్‌పై ప్రస్తావించిన మోదీ.. ఆ ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదన్నారు. ఈ విషయాన్ని బెంగాల్ గడ్డ మీద నిలబడి 140 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రకటిస్తున్నా అని తెలిపారు.