10 March, 2026 | 7:24 PM

రైతుల పక్షాన పోరాడేందుకు సిద్ధం

09-03-2026 01:40 AM

మాజీ మంత్రి జోగు రామన్న 

ఆదిలాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): రైతు బంధు పథకాన్ని విమర్శించే నైతిక హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదని, పేదవారి ఇండ్లు కూల్చడమే కాకుండా రైతు సంక్షేమ పథకాన్ని కూడా మాయం చేస్తుండని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బూటకపు హామీలు ఇచ్చి రైతులను మోసం చేయడమే కాకుండా కొనుగోళ్లలో సైతం షరతులు విధిస్తూ రైతులకు పూర్తిగా అన్యాయం చేస్తుందని ఆరోపించారు.

స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతుల పక్షాన నిలబడి రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు ఇవ్వలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని జోగు రామన్న డిమాండ్ చేశారు.  రైతుల ప్రక్షణ బీఆర్‌ఎస్ పార్టీ నిరసన ఆందోళన కార్యక్రమాలను చేపట్టి కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుతామన్నారు. ఆదివారం బోరజ్ మండలం లోని ఆకోలి గ్రామంలో రైతులకు మద్దతుగా బీఆర్‌ఎస్ పార్టీ అధ్వర్యంలో ప్రతి రైతు కుటుంబాన్ని కలుస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతోంది.

రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. రైతులు అధైర్య పడవద్దు అని,  రైతులకు న్యాయం జరిగేలా ప్రతి రైతు కుటుంబంతో సంతకాల సేకరణ చేపట్టి గవర్నర్ ను కలవడం జరుగుతుందన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో రైతు బంధు నిధులు విడుదల చేసేలా రైతు గళం అసెంబ్లీలో వినిపించేలా  ముందుకు పోవడం జరుగుతుంద ని రామన్న పేర్కొన్నారు.