calender_icon.png 26 September, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్న బిడ్డను చంపిన తండ్రి

21-09-2025 12:00:00 AM

-ఏడ్చిందని నేలకేసి కొట్టిన వైనం

-కన్నీరు మున్నీరవుతున్న కన్నతల్లి 

-భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్

-సూర్యాపేట పట్టణంలో ఘటన                           

సూర్యాపేట, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి) : అభం, శుభం తెలియని 11 నెలల చిన్నారిని కాళ్లు పట్టుకొని నేలకొట్టి చంపేశాడు ఓ కసాయి తండ్రి. చిన్నారి తల్లి నాగమణి తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని నాగారం మండలం డి కొత్తపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు (వెంకటేష్) అనే వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాకు చెందిన నాగమణికి రెండేళ్ల క్రితం వివాహమైంది. ఆ భార్యాభర్తలు సూర్యాపేట పట్టణంలో నివాసం ఉంటుండగా వారికి కుమార్తె భవిజ్ఞ(11)కూతురు ఉంది.

గత రెండు నెలల క్రితం దంపతుల మధ్య వివాదాలు తలెత్తడంతో  నాగమణి తన తల్లి గారి ఊరికి వెళ్లింది. వారం రోజుల క్రితం వెంకటేశ్వర్లు తన అక్క బావలను పంపి తన భార్య నాగమణికి నచ్చజెప్పి ఇక్కడికి వచ్చేలా చేశాడు. శుక్రవారం రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చిన వెంకటేశ్వర్లు తన భార్యతో గొడవకు దిగడంతో వారి కుమార్తె భవిజ్ఞ లేచి ఏడ్చింది. దీంతో ఏడిస్తే పక్కన ఇండ్ల వారు లేసి వస్తారని వెంకటేశ్వర్లు తన కుమార్తె నోరు మూయగా పాపకు ఇబ్బంది అవుతుందని నాగమణి అతని చేతిని పక్కకు తీయగా కోపంతో ఆమెను గట్టిగా పక్కకు తోసేశాడు.

ఆ తర్వాత భవిజ్ఞ రెండు కాళ్లు పట్టుకొని పైకి లేపి రెండుసార్లు నేలకు కొట్టాడని నాగమణి పేర్కొంది. తన బిడ్డలో కదలిక లేకపోవడంతో వెంటనే ఎత్తుకొని ప్రభుత్వాస్పత్రికి రాగా వైద్య సిబ్బంది ఆప్పటికే మృతి చెందినట్లు తెలిపారన్నారు. తన భర్త తన కళ్లముందే కూతురుని కిరాతకంగా చంపాడని అతనిని కఠినంగా శిక్షించాలని కోరిం ది. అలాగే వెంకటేశ్వర్లు సోదరీ సైతం అతనిని కఠినంగా శిక్షించాలని కోరడం గమనార్హం.