24-12-2025 12:12:34 AM
స్టార్ ఆస్పత్రి సమావేశం
హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాం తి): నానక్‌రాంగూడలోని స్టార్ హాస్పిటల్స్ ‘ది 2025 రియాలిటీ చెక్‘ పేరుతో మంగళవారం ప్రత్యేక మీడియా సమావేశాన్ని నిర్వహించిం ది. గత ఏడాది చేసుకున్న ఆరోగ్య వాగ్దానాలు నిజమైన ఫలితాలుగా మారాయో లేదో పరిశీలించడమే దీని ఉద్దేశం. స్టార్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గోపిచంద్ మన్నం సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఆరోగ్య సంరక్షణ అనేది నేడు కేవలం ఆసుపత్రి గోడలకే పరిమితం కాకూడదు.
వ్యాధి భారాన్ని తగ్గించాలనే విష యంలో మనం సీరియస్గా ఉంటే, నివారణ, ముందస్తు గుర్తింపు అనేవి అనారోగ్యానికి ప్రతిస్పందనగా కాకుండా, దైనందిన జీవితం లో భాగం కావాలి’ అని అన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నాయకత్వం స్టార్ హాస్పి టల్స్ ’ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఫిలాసఫీ’ని పునరుద్ఘాటించింది. ‘మేము ప్రతిరోజూ ఎన్నో వ్యాధులకు చికిత్స చేస్తాం, కానీ నివారించగలిగే సమస్యల కోసం ప్రజలు ఆసుపత్రికి రాకుండా చూడటమే మా నిజమైన బాధ్యత,‘ అని పేర్కొన్నారు.
‘2025 ది రియాలిటీ చెక్‘ ప్యానెల్ చర్చ సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ ఆంకాలజీ హెడ్ డాక్టర్ సాయినాథ్ బేతనభట్ల నిర్వహించారు. గత 355 రోజులుగా ఓపీడీ అనుభవాల ఆధారంగా చర్చను నడిపించారు. ఈ ప్యానెల్‌లో వివిధ విభాగాలకు చెందిన డాక్టర్ భరత్ కుమార్ నారా (సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ), డాక్టర్ వై.రామిరెడ్డి (గ్యాస్ట్రోఎంటరాలజీ), డాక్టర్ గాంధే శ్రీధర్ (నెఫ్రాలజీ, ట్రాన్స్ప్లాంట్), డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ శ్రీకాంత్ యెర్రం , డాక్టర్ రోహిణి కస్తూ రి, డాక్టర్ బి.సంతోష్ కుమా ర్ (న్యూరాలజీ) పాల్గొన్నారు.
2025లో వివి ధ వయసు వర్గాల్లో వ్యాధుల నమూనాల్లో ఆందోళన కలిగించే మార్పులు చోటుచేసుకున్నాయని స్టార్ హాస్పిటల్స్ వైద్యులు వెల్లడించారు. స్టార్ హాస్పిటల్స్లో చికిత్స పొందిన రోగులలో 20-30 శాతం మంది 20-30 ఏళ్ల వయసులోనే తీవ్రమైన జీవనశైలి సంబంధిత వ్యాధు లతో బాధపడుతున్నారని వైద్యు లు తెలిపారు. ఎండోక్రైనాలజీ విభాగం గణాంకాల ప్రకారం, టైప్2 మధుమేహం యువత లో వేగంగా పెరుగుతోంది.
గుండె, మెటబాలిక్, కాలేయం, మూత్రపిండాలు, న్యూరాలజీ, జీర్ణవ్యవస్థలకు సంబంధించిన వ్యాధుల్లో 10-15 శాతం పెరుగుదల నమోదైంది. వీటిలో చాలా వ్యాధులను స్క్రీనింగ్, జీవనశైలి మార్పుల ద్వారా నివారించవచ్చని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ, స్టార్ హాస్పిటల్స్ 2026ను ‘హీలింగ్ ఇయర్‘ (స్వస్థత నామ సంవత్సరం)గా ప్రకటించింది.