calender_icon.png 24 December, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బర్త్‌రైట్ బై రెయిన్‌బో అధునాతన చికిత్స

24-12-2025 12:10:30 AM

26 ఏళ్ల వివాహితకు లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స

హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): నానక్ రామ్‌గూడలోని బర్త్‌రైట్ బై రెయిన్‌బో హాస్పిటల్ నందు 26 సంవత్సరాల వివాహితకు అరుదైన శస్త్రచికిత్సను అత్యంత ఆధునికమైన లాపరోస్కోపిక్ ద్వారా నిర్వహించారు. ఆమెకు ఇతర హాస్పిటల్స్ నందు ఓపెన్ సర్జరీ చేయాలని చెప్పినప్పటికీ, బర్త్రుటై బై రెయిన్బో హాస్పిటల్ నందలి సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ మానస బద్వేలి అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను ఎంతో నైపుణ్యంగా నిర్వహించారు.

ఈ చికిత్స ద్వారా ఆమె గర్భాశంలోని సుమారు 2.7 కి.గ్రా బరు వు కలిగిన 11 ఫైబ్రాయిడ్స్‌ను విజయవంతం గా తొలగించారు. ఈ ఫైబ్రాయిడ్స్‌లో 3 మస్క్ మిలన్ (కర్భూజా పండు) పరిమాణంలోనూ , మిగిలినవి బత్తాయి పండు (స్వీట్ లైమ్) పరిమాణం కలిగి ఉన్నాయి. ఈ ఫైబ్రాయిడ్స్ కారణంగా ఆమె 8 నెలలు గర్భం పరిమాణం కలిగి కనిపించినది.

ఈ విధమైన కేసులో సంప్రదాయక ఓపెన్ సర్జరీ ఆవశ్యకత ఉన్నప్పటికీ డాక్టర్ మానస అత్యంత నైపుణ్యతతో క్లిష్టతరమైన లాపరోస్కోపిక్ ప్రక్రియను ఉపయోగించి తొలగించారు. అంతేకాక ఆమె సంతానోత్పత్తికి ఎలాంటి భంగం వాటిల్లకుండా జాగ్రత్త వహించారు. ఈ క్లిష్టమైన లాపరోస్కోపిక్ చికిత్స అనంతరం డాక్టర్ మానస బద్వేలి మాట్లాడుతూ దీనిని ఒక సవాలుగా తీసుకుని అత్యంత విజయవంతంగా పూర్తిచేశామన్నారు.