3 July, 2026 | 5:21 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

సొంతింటి కల సాకారమే.. ప్రజా ప్రభుత్వ లక్ష్యం

31-05-2025 12:00 AM
  1. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

కలెక్టర్‌తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ

ఉట్నూర్, మే 30 (విజయక్రాంతి):  పేదో డి సొంతింటి కలను నెరవేరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తోందని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. శుక్రవారం ఉట్నూర్ మండలంలోని హీరాపూర్ (జే), ఇంద్రవెళ్లి మండలం గిన్నెర గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తో కలిసి భూమి పూజ చేసి, లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలను అందజేశా రు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని,  సబ్బండ వర్గాల ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

అంతకు ముందు జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ.. మొదటి విడతలో పైలెట్ ప్రాజెక్టుగా ఒక్కొక్క మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడం జరిగిందనీ, తాజాగా రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల ను ప్రారంభించడం జరిగిందన్నారు.

జిల్లాకు మొదటి విడతగా 7010 ఇందిరమ్మ ఇళ్లు,  రెండవ విడతలో 7010 మంజూరైయన్నారు. ఖానాపూర్  నియోజకవర్గంలో 1,366 ఇండ్లు మంజరయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.