పేద ఆడబిడ్డల పెళ్లి కలలు సాకారం
కల్యాణ లక్ష్మి-, షాదీ ముబారక్- చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
శేరిలింగంపల్లి,జూలై 13(విజయక్రాంతి): పేదల సంక్షేమం లక్ష్యంగా తెలంగాణ ప్రభు త్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం కింద శేరిలింగంపల్లి మం డలం పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్పేట్, చందానగర్, భారతి నగర్ (పార్ట్) డివిజన్లలో 322 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.3,22,37,352/-ఆర్థిక సహా యం అందజేశారు.మియాపూర్లోని ఎమ్మె ల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ల బ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ,పేదల సంక్షేమ మే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుపుతున్న ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు బలమైన మద్దతు ఇస్తూదన్నారు.ఈ పథకం ద్వారా 322 మందికి రూ.3.22 కో ట్లు అందించడం సంతోషకరమని అర్హులందరూ ఈ సంక్షేమ పథకాలను సద్విని యోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యాదవ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్,మాజీ కార్పొరేటర్లు హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






