calender_icon.png 23 August, 2025 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రికార్డు స్థాయిలో శ్రీవారి లడ్డూల విక్రయాలు

23-08-2025 12:57:29 AM

  1. జూలై 12న 4.86 లక్షల అమ్మకాలు
  2. ఆ ఒక్క రోజులోనే రూ.2.43 కోట్ల రాబడి

హైదరాబాద్, ఆగస్టు ౨౨(విజయ క్రాంతి)ః తిరుమలలో ఈ సంవత్సరం  వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదానికి విపరీతమైన గిరాకీ పెరిగింది. ఈ ఏడా ది జూలై 12న రికార్డు స్థాయిలో 4,86,134 లడ్డూలు అమ్ముడయ్యాయి. దీం తో ఏకంగా రూ.62.2 కోట్ల రాబడి వ చ్చింది. గతేడాది ఇదేరోజున ౩.౨౪ లక్ష ల లడ్డూలు అమ్ముడు కాగా.. సుమారు ౩౫ శాతం అమ్మకాలు పెరిగాయి. ఒక్కరోజులో లడ్డూల అమ్మకం ద్వారా రూ. ౨.౪౩ కోట్లు వచ్చాయి.

జూలైలో ౧,౨౪, ౪౦,౦౮౨ లడ్డూలు అమ్ముడు పోగా రూ.౬౨.౨ కోట్ల ఆదాయం వచ్చింది.  భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని  టీటీడీ అధికారులు బఫర్ స్టాక్ కింద నాలు గు లక్షల లడ్డూలు సిద్ధంగా ఉంచారు.  లడ్డూ ప్రసాదం నాణ్యత విషయంలో నూ టీటీడీ పలు చర్యలు చేపట్టింది.

లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి సరఫరా, పరీక్షల కోసం పకడ్బందీగా వ్యవ హరిస్తోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అందించడంలో తీసుకుంటు న్న చర్యలు సత్ఫలితాలను ఇస్తుందని టీ టీడీ అధికారులు పేర్కొన్నారు.   దీంతో లడ్డూ ప్రసాదం అమ్మకాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ ఏడాది జూన్ నుంచి సగటున రోజుకు నాలుగు లక్షల లడ్డూల విక్రయాలు జరుగుతున్నాయి.