calender_icon.png 23 August, 2025 | 2:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నిధులు మంజూరు

23-08-2025 11:32:27 AM

పనులను ప్రారంభించిన...  ఎర్నేని వెంకటరత్నం బాబు 

కోదాడ: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పట్టణాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి దిశగా  అడుగులు వేస్తున్నాయని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. కోదాడ పట్టణ పరిధిలోని లక్ష్మీపురం కాలనీలో ఒకటవ వార్డులో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే  నిధులు ద్వారా మంజూరైన 3 లక్షల రూపాయల తో  సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటరత్నం బాబు మాట్లాడుతూ.... మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారని గుర్తు చేశారు.

ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చేపడుతున్నారని అన్నారు.  సిసి రోడ్డు నిర్మాణాలు నూతన గ్రామ పంచాయతీ నిర్మాణాలు, అంగన్వాడీ భవనాలు, ఇలా ప్రజలకు ఉపయోగపడే  ప్రభుత్వ కార్యాలయాలు గ్రామాలలో నిర్మిస్తున్నారని అన్నారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సారథ్యంలో కోదాడ మున్సిపాలిటీ పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేకపోతుల సత్యనారాయణ, ముస్తఫా, నిజం కృష్ణబాబు,వీరబాబు,జానీ,వెంకన్న రఫీ ప్రసాద్,కృష్ణారావు, లక్ష్మి, పున్నమ్మ,బొబ్బమ్మ ,రాజ్యం తదితరులు పాల్గొన్నారు