23-08-2025 12:58:21 AM
ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి
మోతె, ఆగస్టు 22 : రహదారుల ఏర్పాటుతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కోదాడ శాసనసభ్యులు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నామవరం గ్రామ రహదారికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందించేందుకు కృషి చేస్తుందన్నారు.
నామవరం నుంచి సీతానగరం వరకు సుమారు నాలుగు కోట్ల రూపాయలతో బీటీ రోడ్ల పనులను ప్రారంభించారు. రాష్ట్రంలో కోదాడ నియోజకవర్గంను అభివృద్ధిలో ముందువరుసలో నిలుపుటకు రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల సహకారంతో కృషి చేస్తున్నట్టు తెలిపారు.
దానిలో భాగంగానే ప్రతి పల్లెకు రహదారి సౌకర్యం, గ్రామంలో సిసి రోడ్లు, పేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, అర్హత కలిగిన అందరికీ రేషన్ కార్డులు అర్హులైన వారికి పశువుల కొట్టాలు మంజూరు చేస్తున్నామన్నారు. హుస్సేనాబాద్ గ్రామంలో మండల ప్రేత్యేక అధికారి సీతారామ్ నాయక్ తో కలిసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి లు పశువుల కొట్టం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో వేణు మాధవరావు, తాసిల్దార్ ఎం. వెంకన్న, ఎంపీడీవో ఆంజనేయులు, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గురువారెడ్డి, వెంకటరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెలుగు వీరన్న, సోషల్ మీడియా మండల అధ్యక్షులు అరవపల్లి గణేష్, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.