17 July, 2026 | 2:02 AM

సీఐఆర్ పోర్టల్ సహాయంతో ఫోన్ల రికవరీ

25-09-2025 12:14 AM

ఉప్పల్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి) : ఇటీవల కాలంలో ఫోన్ల చోరీ మిస్ కావడం ఎక్కువ జరుగుతున్నాయని ఫోన్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాచారం ఇన్‌స్పెక్టర్ ధనుంజయ గౌడ్ అన్నారు. బుధవారం నాచారం క్రైమ్ టీం సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటి రిజిస్టర్ సహాయంతో పోగొట్టుకున్న 8 ఫోన్లను రికవరీ చేశారు. ఇట్టి చరవాణిల ను ఆయా యజమానులకు ఇన్‌స్పెక్టర్ చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటి రిజిస్టర్ సిఐఆర్ ద్వారా పోయిన ఫోన్లను గుర్తించి వాటిని రికవరీ చేసినట్టు తెలిపారు. సిఐఆర్ ద్వారా చరవాలను గుర్తించిన క్రైమ్ సిబ్బంది వెంకటేశ్వర్లు రాహుల్ ఎలిజ అశోక్ అశ్వినీ లను అభినందించారు.