25-09-2025 12:14:37 AM
* అక్టోబర్ 16, 17, 18 తేదీలలో క్రీడలు
* ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, సెప్టెంబర్ 24 :మరో మా రు రాష్ట్ర స్థాయి క్రీడలకు పటాన్ చెరు కేం ద్రంగా నిలవబోతోంది. 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి కబడ్డీ, వాలీబాల్ క్రీ డలను పటాన్ చెరు కేంద్రంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని పటాన్ చె రు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపా రు. మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా అధికారులు, వ్యాయామ ఉపా ధ్యాయులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫె డరేషన్ క్రీడలను నిర్వహించేందుకు పటాన్చె రు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా ఇందుకు సమ్మతించినట్లు ఆయన తెలిపారు. అండర్ 17 బాలుర వాలీబాల్, అండర్ 14 బాలురు, బాలికల కబడ్డీ పోటీలను అక్టోబర్ 16, 17, 18 తేదీలలో ప టాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో నిర్వహించబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి 420 మంది క్రీడాకారులతో పాటు వందమంది వ్యాయామ ఉపాధ్యాయులు, సిబ్బంది క్రీడలలో పాల్గొనబోతున్నారని తెలిపారు.
వీరందరికి మూ డు రోజులపాటు భోజనం, వసతి, బహుమతులు సొంత నిధులతో అందిస్తున్నట్లు ఆ యన తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన జట్లను సైతం సొంత నిధు లతో జాతీయస్థాయి పోటీలకు పంపిస్తున్న ట్లు తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గాన్ని రాష్ట్ర, జాతీయ క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, ఎస్ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, గౌసుద్దీన్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.