calender_icon.png 14 August, 2025 | 11:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెడ్‌క్రాస్ సేవలు మరింత విస్తరించాలి

07-08-2025 01:40:50 AM

కలెక్టర్ హరిచందన దాసరి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 6 (విజయక్రాంతి): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హైదరాబాద్ బ్రాంచ్ సేవలను మరింతగా విస్తరించాలని కలెక్టర్ హరిచందన దాసరి పేర్కొన్నారు. బుధవారం మాసబ్ ట్యాంక్‌లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హైద రాబాద్ బ్రాంచ్‌ని చైర్మన్ మామిడి భీమ్‌రెడ్డితో కలిసి ఆమె సందర్శించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెడ్ క్రాస్ భవనంలోని వయోవృద్ధుల కోసం డే కేర్ సెంటర్, అలాగే బ్లడ్ బ్యాంక్ చేపట్టేందుకు భవనంలోని మౌలిక వసతులు పరిశీలన చేశారు. ఈ నిర్వహణ చేపట్టే దిశగా ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయాలని నిర్వాహకులకు సూచించారు. అలాగే రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో చేపట్టే హెల్త్ క్యాంప్ నిర్వహణ గదిని పరిశీలించి అందుతున్న వివిధ సేవా కార్యక్రమా లను ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నా రు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి, వయోవృద్ధుల శాఖ సహాయ సంచాలకులు రాజేందర్, బ్లడ్ బ్యాంక్ కన్వీనర్ విజయ్ భాస్కర్, హైదరాబాద్ బ్రాం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

జయశంకర్‌కు నివాళి..

తెలంగాణ రాష్ర్ట సాధనలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ కృషి, విశేష సేవలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ కదిరవన్ పలనితో కలసి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ కదిరన్ పలని మాట్లాడుతూ  సిద్ధాంతకర్తగా, రాష్ర్ట సాధనలో కీలక పాత్ర పోషించిన మహోన్నతమైన వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని త్యాగం చేసిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని ఆయన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.