calender_icon.png 13 August, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రొఫెసర్ జయశంకర్ జయంతి

07-08-2025 01:38:54 AM

నివాళులర్పించిన గౌడ సంఘాల నేతలు

ముషీరాబాద్/మల్కాజిగిరి, ఆగస్టు 6 (విజయక్రాంతి): తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొ ఫెసర్ జయశంకర్ జయంతి, ప్రజాయుద్ధ నౌక గద్దర్, దివంగత కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ వర్ధంతి కార్యక్రమాలను బుధవారం సాయంత్రం చిక్కడపల్లిలో తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సంద ర్భంగా వారి చిత్ర పటాలకు పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం బిసి పొలిటికల్ ఫ్రంట్  చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్, సమన్వయ కమి టీ చైర్మన్ అయిలి వెంకన్న గౌడ్ లు మాట్లాడుతూ.... తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్రను పోషించిన వీరిని గుర్తు చేసుకోవడం గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సమైఖ్య అధ్యక్షులు ఎస్. దుర్గయ్య గౌడ్, అంబాల నారాయణ గౌడ్, బైరు శేఖర్, కెవి గౌడ్, బడేసాప్, ఐలన్ గౌడ్, జెళ్ల రాజు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో

మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అడవి రాజు అధ్యక్షత వహిం చారు. ముఖ్యవక్త సంగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ త్యాగస్ఫూర్తి, నాయకత్వం విద్యార్థులకు ఆదర్శమన్నారు. డాక్టర్ అడవి రాజు, డాక్టర్ యాదగిరి జయశంకర్ గారి సమర్పణ, సేవలను గుర్తుచేశారు.