4 July, 2026 | 11:13 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

ప్రతి జిల్లాలో రెడ్ క్రాస్ ఏర్పాటు చేయాలి

24-05-2025 01:27 AM

వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

హనుమకొండ, మే 23 (విజయక్రాంతి): అన్ని దానాల్లో కెల్లా రక్తదానం గొప్పదని, రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయటమే అని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.  పరకాల మండల కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ స్టోరేజీ సెంటర్ శంకుస్థాపన, భూమి పూజ కార్యమానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్యఅతిథిగా హాజరై భూమి పూజ చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు మాట్లాడుతూ రక్తదానంతో ప్రాణాపాయంలో ఉన్న వారిని బతికించవచ్చన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఒక వైద్యురాలిగా రక్తం విలువ తనకు తెలుసని అన్నారు. అత్యవసర సమయాల్లో బ్లడ్ అందుబాటులో లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతూ ఉంటారని, ప్రమాదాలు జరిగినప్పుడు, ప్రెగ్నెంట్ లేడీస్, పోస్ట్ డెలివరీ సమయాల్లో సైతం బ్లడ్ అవసరం ఉంటుందని తెలియజేశారు.

ప్రతి జిల్లాలో రెడ్ క్రాస్ అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం వరంగల్, హనుమకొండ జిల్లాలో  రెడ్ క్రాస్ ఉందని, భూపాలపల్లి జనగామ జిల్లాల్లో రెడ్ క్రాస్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు బ్లడ్ చాలా అవసరమని బ్లడ్ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా జిల్లాలోని రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ అందుబాటులో ఉంటే ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు.

రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ నిర్వహణతో పాటు డ్రగ్ డిడిక్షన్ సెంటర్, ఆడపిల్లలకు రక్తహీనత పరీక్షలు, క్యాన్సర్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని ఎంపీ వివరించారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ లో తలసేమియా ఐ సి ఎం ఆర్ పరిశోధన కేంద్ర ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. హనుమకొండ జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రా ఏర్పాటుకు సంబంధించి నిధులు మంజూరుకు కృషి చేస్తానన్నారు.

రెడ్ క్రాస్ సొసైటీ  సేవలను మరింత విస్తృతం చేయాలని ఎంపీ సూచించారు. రెడ్ క్రాస్ సొసైటీ  సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ విజయ్ చందర్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, పరకాల హాస్పిటల్ సూపరిండెంట్ గౌతమ్ చౌహన్, ఆర్డీవో, ఎమ్మార్వో, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్,  రెడ్ క్రాస్ పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.