4 July, 2026 | 9:14 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

పరిశ్రమలపై విద్యుత్ భారాన్ని తగ్గించాలి

07-03-2026 12:06 AM

బొమ్మినేని రవీందర్ రెడ్డి వినతి

హనుమకొండ, మార్చి 6(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ విచారణలో పలు పారిశ్రామిక సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు బొమ్మినేని రవీందర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా కాటన్ అసోసియేషన్ అధ్యక్షులు చింతలపల్లి వీరారావు పాల్గొని పరిశ్రమల సమస్యలను మండలి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్‌కు ప్రోత్సాహం కల్పించాలన్నరు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు విద్యుత్ సబ్సిడీని ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు. ఇప్పటికే పరిశ్రమలు తీవ్ర భారంలో ఉన్నాయని, అదనపు సర్ ఛార్జీలు విధించి వాటిని మరింత కుంగదీయవద్దని విజ్ఞప్తి చేశారు. కాటన్ పరిశ్రమలు సీజనల్ కావడంతో ఏడాదిలో కేవలం 3-4 నెలలు మాత్రమే నడుస్తాయని, మిగిలిన 9 నెలలు ఖాళీగా ఉన్నా విద్యుత్ భారం పడుతోందని,ఆఫ్ సీజన్ పీరియడ్ నిబంధనలను సవరించి పరిశ్రమలకు ఊరటనివ్వాలని కోరారు.

ఎండీ ఛార్జీలు తగ్గించాలన్నారు. కేవలం 4 నెలల పని కాలానికి 12 నెలల పాటు మాగ్జిమమ్ డిమాండ్ ఛార్జీలు చెల్లించడం భారంగా మారిందని, వీటిని తగ్గించాలని విన్నవించారు. 2012లో ఎంఎస్‌పీ సేకరణ కోసం మిల్లులు నడిపిన సమయంలో హెచ్‌టీ వినియోగదారులపై వేసిన పీనల్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయాలని కోరారు. రవీందర్ రెడ్డి గారి విన్నపాలపై ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. పీనల్ ఛార్జీల రద్దు అంశం అతి త్వరలోనే పరిష్కారం అవుతుందని, అధికారిక ఉత్తర్వులు రాగానే పంపిస్తామని హామీ ఇచ్చారు.