శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
- ఇటీవల తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ విభాగంపై నజర్
ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో తనిఖీలు
శేరిలింగంపల్లి, మార్చి 6 (విజయక్రాంతి): శేరిలింగంపల్లి జోనల్ కార్యాల యంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం శుక్రవారం కలకలం రేపింది. ఇటీవల టౌన్ ప్లానింగ్ తోపాటు ఇతర శాఖలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఐదు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఉద్యోగులు ఎవరు కూడా బయటికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ విభాగంపై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలతోపాటు అడ్డు అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతుండడం, నియంత్రించే ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికా రులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. టౌన్ ప్లానిం గ్ విభాగంతో పాటు ఇంజనీరింగ్ శానిటేషన్, బయోడైవర్సిటీ తదితరు విభాగాలలో బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు గుర్తించి నోటీ సులు జారీ చేస్తున్న అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడం లేదు.
సోకాజ్ నోటీసు జారీ చేస్తున్న అధికారులు వివరణ పేరుతో బేరసారాలకు దిగడం, పట్టించుకోని నిర్మా ణ దారులకు స్పీకిం గ్ ఆర్డర్లు జారీ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. పది నెలల కాలంలో సుమారు 450 నోటీసులు జారీచేసిన అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదనే అంశంపై ప్రశ్నిస్తున్నట్లుగా తెలిసింది. అంజ య్య నగర్, గచ్చిబౌలి, జేవి హిల్స్, రాఘవేంద్ర, రాజరాజేశ్వరి, కొండాపూర్ తదితర ప్రాం తాల్లో సీజ్ చేసిన భవనాలు సైతం బోర్డులు తొలగించి నిర్మాణాలు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోకపో వడం వెనుక దాగిఉన్న వ్యవహారంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.
సుదీర్ఘకాలం అనుమతు లు పెండింగ్‌లో పెట్టడం, జారీ చేసిన నోటీస్‌లకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. సీజ్ చేసిన భవనాలు తిరిగి నిర్మించడంపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. డిఎస్పి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగం, ఇంజనీరింగ్, పారిశుధ్యం విభాగంలో సోదాలు చేస్తున్న అధికారులు ఉద్యోగుల నుంచి వివరాలు రాబడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమం లో వివిధ ఫైళ్లు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.




