9 April, 2026 | 5:16 AM

వంద రోజుల పాలనకు రెఫరెండం

14-05-2024 01:20 AM

ఎన్నికల ఫలితాలే చెబుతాయి

దేశంలో మోదీ వ్యతిరేక వేవ్ కొనసాగుతోంది 

ఇండియా కూటమి ప్రభుత్వం రావడం ఖాయం 

పంద్రాగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతాం 

సీఎం రేవంత్‌రెడ్డి

వికారాబాద్, మే 13(విజయక్రాంతి): ఈ పార్లమెంట్ ఎన్నికలు మా వంద రోజుల పాలనకు రెఫరెండమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తన కుటుంబసభ్యులతో కలిసి కొడంగల్‌లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 33.5 శాతం ఓట్లు వచ్చాయని, ఈ ఎన్నికల్లో అంతకుమించి వస్తాయన్నారు. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. బీజేపీ కూడా ఈ ఎన్నికలు మోదీ పాలనకు రెఫరెండం అని చెబుతోందన్నారు.

దేశంలో మోదీ వ్యతిరేక వేవ్ కొనసాగుతుందన్నారు. మ్యాజిక్ ఫిగర్ రాకుంటే బీజేపీ, ఎన్‌డీఏకు దేశంలో మద్దతు ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరన్నారు. 13 ఏళ్లు సీఎంగా, 10 ఏళ్లు పీఎంగా పనిచేసిన మోదీ మన రాజ్యాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం దురదృష్టకరమన్నారు. దేశంలో ఎక్కడా మతపరమైన రిజర్వేషన్లు లేవన్నారు. సామాజికంగా వెనుకబడిన వారికి మాత్రమే దేశంలో రిజర్వేషన్లు అమలువుతున్నట్లు సీఎం తెలిపారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఏపీలో ఎన్‌డీఏ కూటమి ఎందు కు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఇండియా కూటమితో తాము ప్రజలను ఓట్లు అడుగుతుంటే మోదీ పేరుతో బీజేపీ ఓట్లు అడుతుందన్నారు.

ఎవరు నామ్ దార్... ఎవరు కామ్ దార్ దీన్ని బట్టి తెలుస్తోందన్నారు. ఎవరు అట్టడుగువర్గాల ప్రజల కోసం పనిచేస్తున్నారో చర్చకు సిద్ధమన్నారు. మోదీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినా చర్యలు లేవన్నారు. నవనీత్ కౌర్ 15 సెకన్ల కామెంట్స్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీ నేతలపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేయదని, ఒక వీడియో వైరల్ కేసులో మాత్రం మాపై రంగంలోకి దిగినట్లు ఆరోపించారు. ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందనడా నికి ఇదే నిదర్శనమన్నారు.

కాంగ్రెస్‌కు అదా నీ, అంబానీ డబ్బులు ఇస్తున్నారన్న మోదీ.. ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపి వాళ్ల ఆఫీసులు, ఇళ్లలో సోదాలు నిర్వహించాలన్నారు. రైతుబంధు ఎలా ఇచ్చామో పంద్రా గస్టులోగా రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్ర తలను దెబ్బతీసి గుజరాత్‌కు పెట్టుబడులు తరలించుకుపోవాలని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. యూపీ పరిస్థితిని తెలంగాణలో తీసుకరావాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. కేసీఆర్‌పై నాకు కూడా సానుభూతి ఉందని, మానసిక ఒత్తిడితో, నిరాశతో అలా ప్రకటనలు చేస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ కూడా కేఏ పాల్ తరహాలో మాట్లాడుతున్నట్లు ఎద్దేవా చేశారు.