జై తెలంగాణ అనని సీఎం.. రాజ్యాంగాన్ని కాపాడుతారట

06-05-2024 01:03:18 AM

బూటకపు వాగ్దానాలతో ప్రజల వంచన

బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఫైర్

భద్రాద్రి కొత్తగూడెం, మే 5 (విజయక్రాంతి): ఏనాడు ‘జై తెలంగాణ’ అనని రేవంత్‌రెడ్డి.. రాజ్యాంగాన్ని కాపాడతామనడం హాస్యాస్పదంగా ఉన్నదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు ఎద్దేవాచేశారు. బూటకపు వాగ్దానాలతో, ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ముమ్మాటికి తెలంగాణ ద్రోహేనని మండిపడ్డారు. ఆదివారం కొత్తగూడెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేగా మాట్లాడు తూ.. రేవంతర్‌రెడ్డి ప్రజాపాలనను గాలి కి వదిలేసి, కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకొన్నారని ఆరోపించారు. కేసీఆర్ ను తిట్టి తన ఇమేజీ పెంచుకోవాలనే తపన తప్పా, ఆయనకు ప్రజాసేవపై చిత్తశుద్ధి లేదని అన్నారు. దళితులను ఆర్థికం గా బలోపేతం చేయడానికి కేసీఆర్ దళితబందు ప్రారంభిస్తే, ఆ నిధులను పక్క దారి పట్టించారని విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో నిర్మించిన అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసే తీరికలేని సీఎం రేవంత్‌రెడ్డి అని విమర్శించారు.

బీఆర్‌ఎస్ పార్టీకి  ఓ చరిత్ర ఉంది, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ లను తుంగలో తొక్కిందని.. రైతుబీమా , రైతు భరోసా, రూ.2 లక్షల రుణమాఫీ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. నోరు పెంచుకొని బెదిరిస్తే భయపడేది లేదని, తాము నోరు విప్పితే అంతకన్నా ఎక్కువగా తిట్టగలమ ని హెచ్చరించారు. కానీ తమకు సంస్కారం అడ్డువస్తున్నదని, ఇప్పటికైన భాష మార్చుకోవాలని హిత వు పలికారు. ఈ ఎన్నికలు శ్రీనివాసరెడ్డి ధనబలం.. నామానాగేశ్వరరావు ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్నాయని అన్నారు. బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెంటకరమణ మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను తొలగిస్తామంటూ కాం గ్రెస్ ప్రయత్నించడంపై మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను తొలగిస్తే ఇక్కడి ప్రజల పరిస్థితి ఏమిటని, మరోవైపు జిల్లాను మహబూబాబాద్ పార్ల మెంట్ పరిధిలోకి మార్చాలని సీఎం యోచిస్తున్నారని ఆరోపించారు.  ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు దిండిగల రాజేందర్, భవాని శంకర్, అనుదీప్,  భాస్కర్‌రావు పాల్గొన్నారు.