calender_icon.png 4 June, 2025 | 3:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన స్లాట్ బుకింగ్ విధానంలో రిజిస్ట్రేషన్లు షురూ..

02-06-2025 10:47:24 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ పనితీరు విధానంలో ఆధునిక, వినూత్న తరహా కార్యక్రమాలను అమలు చేసి, అవకతవకలకు చోటు లేకుండా, సులువుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో సోమవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా నూతన స్లాట్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. ఇందులో మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 13 మంది తమ రిజిస్ట్రేషన్ ల కొరకు స్లాట్ బుకింగ్ చేసుకోగా 12 మంది తమ ఆస్తుల రిజిస్ట్రేషన్లను విజయవంతంగా నిర్వహించుకున్నారు.

తక్కువ సమయంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి కాలాన్ని ఆదా చేయడం కోసం మహబూబాబాద్ సభ రిజిస్టర్ కార్యాలయంలో అదనంగా అదనపు రిజిస్ట్రార్ ని కూడా మహబూబాబాద్ కు కేటాయించారు. నూతన స్లాట్ విధానం ద్వారా ఒక రోజుకు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 96 రిజిస్ట్రేషన్లకు అనుమతి ఉంటుందని, ప్రజలు స్లాట్ బుకింగ్ చేసుకొని నేరుగా వచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవచ్చని ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్నా తమ ఆఫీస్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చని మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ అడప రవీంద్రబాబు తెలిపారు. సోమవారం ఆన్లైన్  స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి వెంటనే రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు.