16 April, 2026 | 12:38 PM

బీజేపీ తోనే సామాజిక తెలంగాణ సాధ్యం

03-06-2025 12:00 AM

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్, జూన్ 2 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ చేసారు.

అనంతరం మాట్లాడు తూ ప్రత్యేక రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయని, బంగారు తెలంగాణ అవుతుంది అనుకుంటే అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. ప్రజలు కలలు కన్న తె లంగాణ బీజేపీ తోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు