calender_icon.png 27 January, 2026 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

23 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమద్ధీకరణ

24-10-2024 12:07:18 AM

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 23 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లను క్రమబద్ధీకరించారు. ఈ మేరకు విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ జిల్లాల్లో పనిచేసే లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తూ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జూనియర్, డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించిన ప్రభుత్వం, 23 మంది అధ్యాపకుల క్రమబద్ధీకరణ కొన్ని కారణాలవల్ల నిలిచిపోయింది. తాజాగా వీరికి కూడా రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.