27-01-2026 12:15:23 PM
నిమ్స్ లో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను పరామర్శించిన కవిత
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తూ గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం పరామర్శించారు. ఎక్సైజ్ పోలీసులంటే గంజాయి ముఠాలకు భయం లేదని కవిత తెలిపారు. ఆబ్కారీ సిబ్బంది వద్ద ఆయుధాలుంటేనే స్మగ్లర్లకు భయం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఆబ్కారీ, అటవీ శాఖ సిబ్బందికి మళ్లీ ఆయుధాలు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నేరగాళ్లు విచ్చలవిడితనం పెరిగిపోయిందని కవిత ఆరోపించారు. ఉద్యమకారులకు ఉద్యమనేతను దూరం చేసిందే సంతోష్ రావు అని కవిత విమర్శించారు. సంతోష్ రావు వల్లే గద్దర్ లాంటి వాళ్లు ప్రగతిభవన్ గేట్ బయట ఉండాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి గూఢచారి సంతోష్ రావు అంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ గూఢచారి సంతోష్ రావుకు శిక్ష పడుతుందనే నమ్మకం లేదన్నారు. సిట్ పిలవడం సరేకానీ.. ఏం శిక్షలు పడతాయో చూడాలన్నారు.