27-01-2026 12:27:29 PM
చిట్యాల, (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని చిట్యాల పట్టణ బిజెపి నాయకులు హైదరాబాదులోని వారి నివాసంలో మంగళవారం కలిశారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో బిజెపి నుండి బరిలో దిగుతున్న నాయకులను ఆయన ఆశీర్వదించారు. చిట్యాల మున్సిపల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలను అందిస్తుందని కేంద్రమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు రుద్రవరం లింగస్వామి, బీజేపీ సీనియర్ నాయకులు కన్నె బోయన మహాలింగం, కన్నె బోయన శ్రీధర్, కన్నె బోయన మురళి కృష్ణ, రుద్రవరం లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.