calender_icon.png 27 January, 2026 | 2:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దూలుగొండ తల్లి జాతర కరపత్రాల ఆవిష్కరణ

27-01-2026 12:30:22 PM

గుండాల,  (విజయక్రాంతి): మండల పరిధిలోని రోళ్లగడ్డ గ్రామంలో ప్రతీ యేటా దూలుగొండ తల్లి జాతరను అంగరంగ వైభవంగా ఈసం వంశీయులు నిర్వహిస్తారు. ప్రతీ సంవత్సరం హోళి పున్నమిలో బుధ, గురు, శుక్రవారాలలో మా కుల దేవత దూలుగొండ తల్లిని కొలుస్తూ వస్తున్నామని, ఈ సంవత్సరం కూడా మార్చి 04, 05, 06 తేదీలలో వచ్చే బుధ, గురు, శుక్రవారాలలో మూడు రోజుల పాటు ఈ జాతరను కన్నుల పండువగా వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జాతరకు సంబంధించిన కరపత్రాలను ఈసం కృష్ణ(టీచర్), ఈసం సారయ్య(ప్రొఫెసర్), డిస్కో వెంకన్న(టీచర్)లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈసం వంశీయులు పాపారావు, కృష్ణ, ఉదయ్, కార్తీక్, చంద్రశేఖర్, పాణి, హరికృష్ణ, రాజేష్, వడ్డెలు ప్రభాకర్, వసంత రావు తదితరులు పాల్గొన్నారు.