calender_icon.png 27 January, 2026 | 2:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవిష్యత్తులో నిరోషా ఉన్నత వైద్యురాలిగా ఎదగాలి

27-01-2026 12:25:42 PM

మఠంపల్లి జనవరి 27: భవిష్యత్తులో నిరోషా ఉన్నత వైద్యురాలిగా ఎదిగి సమాజ సేవ చేయాలని మఠంపల్లి మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్  నాయకులు గుండా బ్రహ్మ రెడ్డి ఆకాంక్షించారు.సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని ఆవిరేణి కుంటతండా కు చెందిన బాణోత్ కోటయ్య కుమార్తె నిరోషా సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ సంవత్సరం చదువుతుంది.

ఆ విద్యార్థిని నేపథ్యం నిరుపేద కుటుంబం కావడం దానికి తోడు తన తండ్రి కోటయ్య ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని తెలిపారు.వైద్య విద్యా చివరి సంవత్సరంలో చదవడానికి ఆర్థిక పరిస్థితులు అడ్డురావడంతో ఈ విషయాన్ని స్వయంగా తెలుసుకున్న బ్రహ్మ రెడ్డి యాభై వేలు రూపాయలు ఆర్థిక సహాయం మంగళవారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య విద్యలో ప్రతిభ కనబరిచి నిరుపేదలకు సేవ చేయాలని కోరారు.అలాగే రానున్న రోజుల్లో ఆమె మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కృష్ణ తండా సర్పంచ్ బాణోతు రమాదేవి శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.