27-01-2026 12:32:07 PM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి):సర్పంచుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పాలెం గ్రామ సర్పంచ్ బోనాసి రామకృష్ణను మంగళవారం మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, గ్రామ పెద్దలు, ఆత్మీయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న రామకృష్ణకు ఈ పదవి మరింత బాధ్యతను పెంచుతుందని మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, పలువురు గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రామకృష్ణకు అభినందనలు తెలిపారు.