calender_icon.png 27 January, 2026 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవ ఆహ్వానం

27-01-2026 12:28:54 PM

ఎమ్మెల్యేకు అధికారిక ఆహ్వానం అందజేసిన అధికారులు.

చిట్యాల, జనవరి 27(విజయక్రాంతి): శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి వారి కల్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను నకరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం కు ఆలయ అధికారులు మంగళవారం అందజేశారు. ఫిబ్రవరి 01 న నార్కెట్‌పల్లి మండలం గోపాలయిపల్లి గ్రామంలో నిర్వహించనున్న శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి వారి కల్యాణ మహోత్సవం సందర్భంగా  నకిరేకల్ శాసనసభ్యుడు  వేముల వీరేశంకి అధికారికంగా ఆహ్వాన పత్రికను ఆలయ ఈవో, గ్రామ సర్పంచ్ అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పవిత్ర కల్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. భక్తులకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు.