calender_icon.png 27 January, 2026 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిత్రుడి కుటుంబానికి స్నేహితుల అండ

27-01-2026 12:23:56 PM

నంగునూరు,(విజయక్రాంతి): కష్టాల్లో ఉన్న స్నేహితుడికి అండగా నిలిచి తమ మానవత్వాన్ని చాటుకున్నారు నంగునూరు కు చెందిన స్నేహితులు.గ్రామానికి చెందిన బోజు రాజలింగం తండ్రి రాజయ్య ఇటీవల అనారోగ్యం తో మృతి చెందగా అతని 2004–05 పదవ తరగతి బ్యాచ్ మిత్రులు మంగళవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి తమ వంతు సహాయంగా రూ.20 వేళ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టకాలంలో ఎల్లప్పుడూ తోడుంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మిత్రులు కోండిల్ల రాజు,పాపిగాని నరేష్, కోలా రాజు, అనారాజు రాజు, గాడి చర్ల సంపత్, సొప్పరి రమేష్‌,సర్పంచ్ సానాదుల బాల పోచయ్య, సంఘ అధ్యక్షుడు బడే రాజయ్య తదితరులు పాల్గొన్నారు.