calender_icon.png 12 May, 2025 | 11:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైలెవల్ బ్రిడ్జీ కోసం రిలే దీక్షలు

11-05-2025 05:04:18 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాంపురం పాకాల ఏటిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభించారు. దీక్షలను జిల్లా సిపిఐ కార్యదర్శి విజయసారధి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయసారధి మాట్లాడుతూ... పాకాల ఏటిపై హై లెవెల్ బ్రిడ్జి లేకపోవడం వల్ల ప్రతి ఏటా వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోతున్నాయని, అనేకసార్లు బ్రిడ్జి నిర్మాణం కోసం హామీలు ఇస్తూ కాలం వెళ్లదీయడం తప్ప ఇప్పటివరకు అమలుకు నోచకోలేదన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం స్పందించే వరకు రిలే దీక్షలు నిర్వహిస్తామని, అవసరమైతే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కట్టబోయిన శ్రీనివాస్, రాగం రమేష్, సింగు రమేష్, దార్ల నాగేష్, ధరావత్ వీరన్న, దూపటి జనార్దన్, మాగం లోకేష్, ఇరుగు వెంకటేష్, పొన్నం వెంకన్న, శ్రీనివాస్ పాల్గొన్నారు.