11-05-2025 05:09:48 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): మావోయిస్టుల మందు పాత్రలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి అన్నారు. ఆదివారం కామారెడ్డి నియోజకవర్గంలోని పాల్వంచ గ్రామంలో కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కానిస్టేబుల్ శ్రీధర్ మృతి చెందడం చాలా బాధాకరమైన అన్నారు. కేంద్ర ప్రభుత్వము ద్వారా మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని ఆయన తెలిపారు. ఎలాంటి సహాయం అవసరం ఉన్న తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే శ్రీధర్ కుటుంబ సభ్యులకు తెలిపారు. పార్టీ కార్యకర్తలు నాయకులు సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.