calender_icon.png 12 May, 2025 | 11:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణహిత చేవెళ్ల 22వ ప్యాకేజీకి నిధులు విడుదల పట్ల హర్షం

11-05-2025 04:58:11 PM

కామారెడ్డిలో ప్రాణహిత చేవెళ్ల పైలాన్ కు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు

 టపాకాయలు కాల్చి సంబరాలు 

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించేందుకు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాణహిత చేవెళ్ల పథకం ద్వారా 22వ ప్యాకేజీ పనులు ప్రారంభించారు. కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించాలని ఉద్దేశంతో కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో  పైలాన్ ఏర్పాటు చేసి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిచేతుల మీదుగా 22వ ప్యాకేజీ పైలాన్ ను ప్రారంభించారు. తరువాత వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల 22 ప్యాకేజీ పనులను పట్టించుకోలేదు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చొరవ తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి నిధులు మంజూరు చేయించడంతో రైతులు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలోని ప్రాణహిత చేవెళ్ల 22వ ప్యాకేజీ ఫై లాన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రైతులకు సాగునీరు అందించాలని ఉద్దేశంతో రూ. 23 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించ డంపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస రావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు, లతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించి పటాకులు కాల్చి సంబరాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతుల ప్రయోజనం కోసం సాగునీరు శాశ్వతంగా అందించ దానికి ప్రాణహిత, చేవెళ్ల 22వ ప్యాకేజీ పనులకు నిధులు మంజూరు చేసినందుకు నియోజకవర్గ రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రయోజనం కోసం పాటుపడుతుందని వారన్నారు. గతంలో 10 సంవత్సరాలు పాలన చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం కామారెడ్డి ఎల్లారెడ్డి రైతుల ప్రయోజనాన్ని పక్కన పెట్టారని నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేశారని వారు పేర్కొన్నారు.

ఇప్పటికైనా కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతుల ప్రయోజనం కోసం నిధులు మంజూరు కోసం కృషి చేసిన షబ్బీర్ అలికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , సంబంధిత శాఖ మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ సి డి సి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొడుగుల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ అన్వర్ అహ్మద్, కోయల్ కార్ కన్నయ్య, తేజపు ప్రసాద్, మాజీ జెడ్పిటిసి నిమ్మ మోహన్ రెడ్డి, కొలిమి భీమ్రెడ్డి, కిషన్ రావు, గంగాధర్,  సందీప్, పంతులు శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, తదితరులు పాల్గొన్నారు.