25 February, 2026 | 7:01 PM

కాలేశ్వరం కాలువల పనులు పూర్తి చేయాలని రిలే దీక్ష

25-02-2026 05:19 PM

తంగళ్ళపల్లి,(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రం పెద్ద లింగాపూర్ గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలు 11/6, 11/5, 11/4 పరిధిలో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కాలువ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన రిలే నిరాహార దీక్షకు బస్వాపూర్ సర్పంచ్, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు పూర్మనీ రాజశేఖర్ రెడ్డి మద్దతు తెలిపారు. సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ ప్రజలు, రైతులు ఐక్యంగా దీక్షలో పాల్గొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి కాలువ పనులు పూర్తి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.