3 September, 2026 | 1:26 AM

ఎడ తెగని పోరు

03-09-2026 | 12:00am

పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండంగా మారింది. గత కొంతకాలంగా సద్దుమణిగినట్లు కనిపించిన అమెరికా(America)-ఇరాన్ యుద్ధం(Iran War) మళ్లీ తీవ్రరూపం దాల్చడం కలవరపెడుతున్నది. ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాల(Military bases)పై అమెరికా దాడులను మళ్లీ తీవ్రతరం చేయగా, అమెరికా సైనిక స్థావరాలున్న దేశాలపై ఇరాన్ ప్రతిదాడులకు దిగడంతో మరోసారి ప్రమాద ఘంటికలు(Alarm bells) మోగుతున్నాయి. యుద్ధం ప్రారంభించడం సులువే కావచ్చు కానీ, దాన్ని ముగించడం అంత సులభం కాదని ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

కాగా, ఇరాన్‌పై సైనిక ఒత్తిడి పెంచడం ద్వారా సానుకూల ఫలితాన్ని సాధించాలని అగ్రరాజ్యం మొదటి నుంచి ప్రయత్నిస్తున్నది. అయితే, తీవ్రమైన ఆర్థిక, సైనిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్పటి కీ, ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. పరస్పర దాడులు కొనసాగుతున్న కొద్దీ ఇరుదేశాలకూ యుద్ధం నుంచి గౌరవప్రదంగా బయటపడే మార్గం మరింత సంక్లిష్టంగా మారుతున్నదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఖతార్ వంటి దేశాలు చేసిన దౌత్యపరమైన ప్ర యత్నాలు ఫలించకపోవడం ఆందోళనకరం. గతంలో తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించడం, శాంతి చర్చలకు ముందుకురావడం లాంటి సానుకూల వాతావరణం కనిపించినప్పటికీ శాశ్వత శాంతి దిశగా అడుగులు పడకపోవడం శోచనీయం. ఇరాన్ అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షల ఎత్తివేత, హోర్ముజ్ జలసంధి, అమెరికా సైనికుల ఉపసంహరణ వంటి కీలక అంశాలపై ఇరుపక్షాల మధ్య భేదాభిప్రాయాలు కొన సాగుతుండటం ప్రతిబంధకంగా మారింది.

అయితే, ఈ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతుండటంతో అరబ్ దేశాల వైఖరిలోనూ వ్యూహాత్మక మార్పు రావడం సరికొత్త పరిణామమని చెప్పా లి. ఇరాన్‌ను ఎదుర్కోవడంలో అమెరికాపై పూర్తిగా ఆధారపడటం సరికాదన్న భావన గల్ఫ్ దేశాల్లో క్రమంగా బలపడుతున్నది. అగ్రరాజ్యం మూ లంగా యుద్ధం తమ భూభాగాలను, చమురు క్షేత్రాలను తాకడంతో అర బ్ దేశాలు సొంత భద్రతా సామర్థ్యాన్ని పెంచుకోవడం, పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టిసారించాయి.

ఈ తరుణంలో యు ద్ధాన్ని ముగించేందుకు అవసరమైన రాజకీయ పరిష్కారాన్ని కనుగొనడం సవాలుగా మారింది. అరబ్ దేశాలు కూటములు కడుతున్న నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధంగా మారకముందే పశ్చిమాసియాలో రగులుతున్న మంటలను ఆర్పాల్సిన అవసరం ఉంది.