09-09-2025 01:30:15 AM
-బీజేపీ వేసిన పరువునష్టం పిటిషన్ కొట్టివేత
ఢిల్లీ, సెప్టెంబర్ 8ః ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రేవంత్‌పై తెలంగాణ బీజేపీ దాఖలు చేసిన పరువునష్టం దావా కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేసును కొట్టివేసిన తర్వాత కూడా వాదనలు కొనసాగించే ప్రయత్నం చేసిన బీజేపీ తరఫు న్యాయవాదిపై ప్రధాన న్యాయమూర్తి త్రీవ అసహనం వ్యక్తం చేశారు.
రూ.౧౦ లక్షలు జరిమానా విధిస్తామని గట్టిగా హెచ్చరించారు. గతేడాది లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో జరిగిన సభలో రేవంత్‌రెడ్డి బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో రిజర్వేషన్లను రద్దు చేస్తుందన్నారు. దీంతో ఆయన ప్రసంగంపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు హైదరాబాద్ ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై రేవంత్‌రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. రాజకీయ నేతల ప్రసంగాల్లో అతి శయో క్తులు సహజమని, వాటిని పరువు నష్టంగా పరిగణించలేమని స్పష్టం చేస్తూ హైకోర్టు ఆ కేసును కొట్టివేయగా ఆ తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ కేసును కొట్టివేసింది.