calender_icon.png 9 September, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేపాల్‌లో కదం తొక్కిన యువత

09-09-2025 01:00:21 AM

అవినీతిపై.. జెన్ జెడ్ విప్లవం కల్లోల నేపాల్

  1. సామాజిక మాధ్యమాల నిషేధంపై భగ్గుమన్న ‘జెన్‌జెడ్’
  2. పలు చోట్ల ఇంటర్నెట్ సేవలు నిలిపేసిన ప్రభుత్వం 
  3.   20 మంది మృతి, 250 మందికి గాయాలు 
  4. రాజధానిలో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ
  5. ఉన్నపళంగా క్యాబినెట్ భేటీకి పిలుపునిచ్చిన ప్రధాని
  6. రాజీనామా చేసిన హోం మంత్రి

ఖాట్మాండు, సెప్టెంబర్ 8: నేపాల్ రాజధాని ఖాట్మాండు నిరసనలతో అట్టుడుకుతోంది. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వ అవినీతి, 26 సోషల్ మీడియా యాప్స్‌పై నిషేధానికి వ్యతిరేకంగా  యువత కదం తొక్కింది. పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి తమ నిరసనను తెలియజేశారు. ప్ల కార్డులు పట్టుకుని పార్లమెంట్ వైపు ర్యాలీగా వెళ్తుండగా.. వారు వెళ్లేందుకు వీలు లేకుండా పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి.. నిషేదాజ్ఞలు విధించారు.

అయినా నిరసనకారులు బారికేడ్లు దూకి పార్లమెంట్ భవ నంలోకి చొ చ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పార్లమెంట్ గేట్‌కు నిప్పు పెట్టారు. దీంతో నిరసనలను అదుపుచేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించా రు. పోలీసుల దాడుల్లో 20 మంది మృత్యువాతపడగా.. 25 0 మంది గాయపడినట్టు తెలుస్తోంది. అనంతరం ఖాట్మాండులోని పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.

ఆన్‌లైన్ వేదికగా ప్రారంభం అయిన ఈ ఉద్యమం నెమ్మ దిగా వీధుల్లోకి వ్యాపించింది. ‘జెన్ జెడ్’ విప్లవంగా పిలవబడుతున్న ఈ నిరసనకు అనేక మంది యువత తరలివచ్చారు. నేపాల్ ప్రధా ని కేపీ శర్మ ఓలి ఉన్నపళంగా క్యాబినెట్ భేటీకి పిలుపునిచ్చారు. నిరసనలకు నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ప్రధాని రాజీనామా చేసి మరలా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. 

అన్ని వయసులవారూ పాల్గొంటున్నారు

ఈ ఉద్యమంలో జెన్ జెడ్ వర్గం మాత్రమే పాల్గొంటున్నారనే వాదనను పలువురు ప్ర త్యక్ష సాక్షులు కొట్టిపారేశారు. ఈ నిరసనలో అన్ని వర్గాల ప్రజ లు పాల్గొంటున్నట్టు వారు పేర్కొన్నారు. కేవ లం సామాజిక మాధ్యమా ల నిషేధం అని మాత్రమే కాకుండా ఇంకా అనేక కారణాలతో ఉద్యమంలో పాల్గొంటున్నట్టు తెలిపారు. ‘దేశంలో పెరుగుతూ పోతు న్న అవినీతికి వ్యతిరేకంగా ఈ నిరసన. ప్రభు త్వం జవాబుదారీగా ఉండాలనే షరతుతో ఈ నిరసన విస్తృత పౌర ఉద్యమంగా పరిణా మం చెందింది’ అని పేర్కొన్నారు. 

ఆర్మీ ఉన్నత స్థాయి సమావేశం 

నిరసనల నేపథ్యంలో రాజధానిలోని పలు ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించారని, నేపాల్ సైన్యం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తోందని ప్రభుత్వ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. నేపాల్ రాజధాని ఖాట్మాండులోని ప్రధాని నివాసంలో జాతీ య భద్రతా మండలి ఉన్నత స్థాయి సమావే శం జరుగుతోంది. ప్రధాని అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ప్రధాన కార్యదర్శి ఏక్ నారాయణ్ ఆర్యల్, ఆర్థిక మంత్రి బిష్ణు పౌడెల్, హోం మంత్రి రమేష్ లేఖక్, విదేశాం గ మంత్రి అర్జు రానా దేవుబా, రక్షణ మంత్రి మన్బీర్ రాయ్, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్డేల్ తదితరులు హాజరయ్యారు. 

నిషేధానికి కారణమిదే.. 

ఆగస్టు 28న నేపాల్ ప్రభుత్వం ఒక నిర్ణ యం తీసుకుంది. దేశంలోని అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు కమ్యూనికేష న్స్, ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖలో నమోదు చేసుకోవాలని సూచించింది. ఇందుకు ఏడురోజులపాటు సెప్టెంబర్ 4 వరకు గడువు విధించింది. అయితే ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విటర్, వాట్సాప్ వంటి 26 రకాల యాప్స్ నమోదు చేసుకోవడంలో విఫలం అయ్యా యి. దీంతో ప్రభుత్వం వాటిపై నిషేధం విధించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జెన్ జెడ్ వర్గం ఆందోళనలకు దిగింది.

ఆదేశాల్ని పాటించని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను నిషేధించామని ప్రభుత్వం చెబుతుండగా.. ప్రభుత్వం తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించే వారి గొంతును అణచివేసేం దుకే ప్రభుత్వం ఇలా చేసిందని నిరసనకారు లు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఫోన్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినా జెన్‌జెడ్ నిరసన కారులు టిక్‌టాక్, రెడ్డిట్ వంటి ప్రత్యామ్నా య సామాజిక మాధ్యమాల వైపు మొగ్గుచూపారు.

వేలాది మంది జెన్‌జెడ్ నిరసనకా రులు ఒక్కచోటుకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైతిఘర్ మండల వద్ద ప్రారంభమైన ఈ మార్చ్ పార్లమెంట్ భవనం వైపుకు కదిలింది. నిరసన కా రులు పార్లమెంట్ వద్దకు చేరుకోగానే పోలీసులు బారికేడ్లు అడ్డంగా పెట్టి వారిని నిలువ రించే ప్రయత్నం చేశారు.

నిరసనకారులు వా టిని దూకుతూ ముందుకు కదిలారు. నిరసనకారులను అదుపుచేసేందుకు వాటర్ కెనా న్స్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. గందరగోళం ఏర్పడి కొద్దిమంది నిరసనకారులు పా ర్లమెంట్‌లోనికి చొచ్చుకునిపోయారు. పోలీసులు నిరసనకారుల పైకి టియర్ గ్యాస్ వదు లుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. నిరసన కారులు పోలీసులపైకి కొమ్మలు, వాటర్‌బాటిల్స్ విసిరేశారు. 

పార్లమెంట్ గేట్ ధ్వంసం.. 

నిరసనకారులు పార్లమెంట్ గేట్‌ను ధ్వం సం చేసి, ఆ గేటుకు నిప్పంటించారు.   ‘స్వతంత్ర  అభిప్రాయాలు తెలపడం మన హ క్కు’ ‘పన్ను చెల్లింపుదారుల డబ్బులు ఎక్కడికి పోతున్నాయి’ అని రాసి ఉన్న ప్లకార్డులు, జెం డాలు పట్టుకుని యువత నిరసనలు చేస్తున్నా రు.  జెన్‌జెడ్ విప్లవంగా పిలవబడుతున్న ఈ ఉద్యమం అవినీతి, ఆర్థిక అసమానతలపై యువతలో రగులుతున్న కోపం నుంచి ఉద్భవించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతు న్నారు. సోషల్ మీడియాను నియం త్రించాల నే ప్రభుత్వ చర్య ఆజ్యంలా పని చేసేంది. దీంతో యువతలో ఒక్కసారిగా అసహనం కట్టలు తెంచుకుంది.

నిషేధం సబబే: నేపాల్ ప్రధాని 

నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి నేపాల్ ప్రభుత్వం తీసుకున్న సామాజిక మాధ్యమాల నిషేధాన్ని సమర్ధించారు. ‘దేశాన్ని అణచివేసే ఏ చర్యనూ ఉపేక్షించబోం’ అని చెప్పారు. అనేక గ్రూపులు సామాజిక మాధ్యమాల నిషేధాన్ని వ్యతిరేకిస్తు న్నాయి. అధికార పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యునిఫైడ్ మార్సిస్ట్. సమావేశంలో ఓలి ఈ నిరసనలపై స్పందించారు.

‘పార్టీ ఎల్లప్పుడూ క్రమశిక్షణా రాహిత్యం, అహంకారానికి వ్యతిరేకంగా నిలుస్తుంది. దేశాన్ని బలహీనపరిచే ఏ చర్యను కూడా అంగీకరించదు. కొంత మంది వ్యక్తులు ఉద్యోగాలు కోల్పోవడం కంటే దేశస్వాతంత్య్రం గొప్పది. చట్టాన్ని, రాజ్యాం గాన్ని ధిక్కరించడం, జాతీయ సమగ్రతకు భంగం కలిగించడం, సార్వభౌమ త్వాన్ని అగౌరవపరచడం ఎలా ఆమోదయోగ్యం’ అని పేర్కొన్నారు.