09-09-2025 01:30:46 AM
అమరావతి, సెప్టెంబర్8: ప్రము ఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా సీనియర్ అధికారి అనిల్‌కుమార్ సిం ఘాల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ని యమించింది. ప్రస్తుతం టీటీటీ ఈ వోగా పనిచేస్తున్న శ్యామలరావును సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. కాగా అనిల్‌కుమార్ సింఘాల్ మరోసారి టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.
2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రా గానే ఐఏఎస్ బదిలీలు చేపట్టింది. ఆ సమయంలో సైతం అనిల్‌కుమార్ సింఘాల్‌ను టీటీడీ ఈవోగా నియమించింది. అప్పటి నుంచి వైసీపీ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల వరకు ఆయన అదే పదవిలో కొనసాగిన సంగతి తెలిసిందే.
కాగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఘటనపై టీటీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించి టీటీడీ ఈవోపై సీరియస్ అయినట్ల్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.ఈ క్రమంలోనే టీటీడీగా ఈవోగా మళ్లీ అనిల్‌కుమార్‌ను నియమించినట్లు తెలుస్తోంది.