15 May, 2026 | 8:17 PM

Breaking News

బాన్సువాడలో నూతన ఆర్డీఓ క్యాంప్ కార్యాలయం ప్రారంభం   •   పరీక్ష కేంద్రం వద్ద చల్లటి నీరు, అంబలి పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న   •   జవహర్ నవోదయ పాఠశాలకు భూమి స్వాధీనం.. రైతులతో చర్చించి సరిహద్దుల ఖరారు   •   ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి   •   మలిదశ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్   •   ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం   •   ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడం సిగ్గుచేటు   •   దొంగలు... బాబోయ్... దొంగలు...   •   చెంచుల జీవనోపాధికి టీజీఐఎల్పీ కీలకం   •   మోడీది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు.. రెండు నాలుకల సర్కార్   •  

హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట

21-03-2025 12:53 AM
  1. ఫోన్ ట్యాపింగ్ ఎఫ్‌ఐఆర్ కొట్టివేత
  2. రాధాకిషన్‌రావుపై నమోదైన ఎఫ్‌ఐఆర్ కూడా

హైదరాబాద్, మార్చి 20: మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కు హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు ఆయనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. కాంగ్రె స్ నేత, సిద్దిపేటకు చెందిన స్థిరాస్తి వ్యాపారి చక్రధరగౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు హరీశ్‌రావుతో పాటు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై కేసు నమోదు చేశారు.

ఎఫ్‌ఐఆర్‌లో వారిద్దరినీ నిం దితులుగా పేర్కొన్నారు. తనపై న మోదైన తప్పుడు కేసును కొట్టేయాలంటూ మాజీమంత్రి హరీశ్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే దర్యాప్తులో భాగం గా హరీశ్‌రావును అరెస్ట్ చేయొద్దం టూ కోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ కేసులో ఇరువైపుల వాదనలు ముగిసిన నేపథ్యంలో గు రువారం ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేస్తూ హైకోర్టు తీర్పు నిచ్చింది.