24 August, 2026 | 2:43 AM

రోడ్ల మరమ్మతుకు రూ. 25 లక్షలు మంజూరు

24-08-2026 01:33 AM

ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరట 

మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి 

కామారెడ్డి, ఆగస్టు 23 (విజయక్రాంతి): ఏళ్ల తరబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వివిధ కాలనీల ప్రజల కు మోక్షం లభించిందని మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి అన్నారు. ఆదివారం కామారెడ్డి పంచముఖ హనుమాన్ కాలనీ అడ్లూరు రోడ్డు మరమ్మత్తు పనులకు పనులు ప్రారంభించారు. గత కొన్ని ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ దృష్టికి  తీసుకురావడంతో వెంటనే స్పందించి 25 లక్షల నిధులను మంజూరు చేయించారని తెలిపారు.

గతంలో ఉన్న ఎమ్మెల్యే కు స్థానికులు విన్నవించిన పట్టించుకోలేదని అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కూడా నీధులు మంజూరు చేయించలేదని అన్నారు. షబ్బీర్ అలీ కి స్థానిక కౌన్సిలర్లు, ప్రజలు రోడ్డు ఇబ్బందులను వివరించడంతో వెంటనే స్పందించా స్పందించారని స్థానిక ప్రజల తరఫున షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. 25 లక్షలు మంజూరు చేసి ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు సమస్యను పరిష్కరించారని ఆమె అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే అభివృద్ధి ప్రదాత షబ్బీర్ అలీ అని అన్నారు.

పంచముఖి హనుమాన్ మందిరం నుంచి రైల్వే గేట్ వరకు ఉన్న ప్రధాన రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతింది. రహదారి పూర్తిగా ద్వంతం కావడంతో ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, రిజిస్ట్రేషన్ కార్యాలయం, కొత్త బస్టాండ్ కి వెళ్లే రాహదారి, విద్యార్థులు స్కూళ్లకు వెళ్లేందుకు ప్రధాన రోడ్డు మార్గం కావడంతో నిత్యము ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ సమస్యను 41 వ వార్డు, 48 వార్డు, 18 వార్డ్ లకు చెందిన  ప్రజలు నిత్యం ఇబ్బందులకు గురయ్యారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఆయా కాలనీల ప్రజలకు తో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి చెప్పారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సందీప్ కుమార్, డిసిసి ఉపాధ్యక్షుడు పండ్లరాజు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పుట్నాల శ్రీనివాస్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు భూమని బాలరాజు, వార్డు కౌన్సిలర్లు కాళ్ల రాజమణి, గణేష్, షేరు, అన్వర్ అహ్మద్, కళ్లెం సత్యం, సాయిలు, మిషన్ రావు, లక్క పత్ని గంగాధర్, మలహరి, ఇర్ఫాన్, తదితరులు పాల్గొన్నారు.