13-12-2025 01:25:10 AM
టికెట్ ధరల పెంపు విషయంలో ‘అఖండ 2: తాండవం’ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సినిమా టికెట్ల ధరల పెంపు, ముందస్తు ప్రీమియర్లపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై ఈ నెల 14 వరకు డివిజన్ బెంచ్ స్టే ఇవ్వడమే కాకుండా తదుపరి విచారణను ఇదే నెల 15వ తేదీ వరకు వాయిదా వేసింది.
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టికెట్ ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వ్యులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, టికెట్ ధరల పెంపు, ప్రీమియర్స్‌పై గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీన్ని విచారించిన కోర్టు ప్రీమియర్ రద్దుతోపాటు, టికెట్ ధరలను పెంచొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ డివిజన్‌కు అప్పీల్ చేసుకుంది.