27 June, 2026 | 3:33 AM

‘ఊర చెరువు’ బాధితులకు హైకోర్టులో ఊరట

27-06-2026 02:08 AM

హనుమకొండ, జూన్ 26 (విజయక్రాంతి): గోపాల పూర్ ఊర చెరువులో జరుగుతున్న పనులపై నాలుగు వారాల పాటు స్టే విధించి తదుపరి విచారణ వరకు పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిందని కందుకూరి శ్రీనాథ్ తెలిపారు. హనుమకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోపాలపూర్ వాసులతో కలిసి శ్రీనాథ్ మాట్లాడుతూ అభివృద్ధి పేరిట గోపాలపూర్ ఊర చెరువు కట్ట

రిటర్నింగ్ వాల్ నిర్మాణం పేరుతో గోపాలపూర్ వాసుల సమాధులను కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ గోపాలపూర్ గ్రామస్తులు కోర్టును ఆశ్రయించారని,దళితులు, బీసీల సమాధులు తొలగిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నామన్నారు. బాధితుల పిటిషన్ను విచారించిన హైకోర్టు చెరువులో జరుగుతున్న పనులపై నాలుగు వారాల పాటు స్టే విధించి తదుపరి విచారణ వరకు పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్మశాన వాటికకు కేటాయించిన మూడు ఎకరాల స్థలాన్ని అన్యక్రాంతం కాకుండా ప్రహరీ గోడ నిర్మించి, కూల్చిన సమాధులను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కందుకూరి మహేందర్, ఇమ్మడి రాజేంద్రప్రసాద్, గిన్నారపు రాజు, ఇమ్మడి అశోక్ బాబు, నూతన్, శ్రీకాంత్,గొర్రె సతీష్, శరత్ తదితరులు పాల్గొన్నారు.