ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు
26-03-2026 05:06 PM
హైదరాబాద్: మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో(Moinabad Farmhouse Drugs Case) నిందితులకు కస్టడీ పొడించారు. నిందితులకు రిమాండ్ ను ఏప్రిల్ 8 వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులను ఈ నెల 23న కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించారు. కస్టడీ గడువు ముగియడంతో పోలీసులు పైలెట్ రోహిత్ రెడ్డి(Pilot Rohith Reddy), రితేశ్ రెడ్డి, నమిత్ శర్మను కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితులను 3 రోజుల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు.




