5 July, 2026 | 2:27 AM

ఎస్‌హెచ్‌ఓకు శాంతి కమిటీ సన్మానం

05-07-2026 12:00 AM

ఖైరతాబాద్, జూలై 4 (విజయక్రాంతి): పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకొంటూ పోలీస్ శాఖకు సహకరిస్తా మని సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ ఖైరతాబాద్ జోన్ ప్రతినిధులు తెలిపారు.

కమిటీ జోన్ అధ్యక్షుడు శశికాంత్ అగర్వాల్ ఆధ్వర్యంలో సభ్యులు ఖైరతాబాద్ ఎస్‌హెచ్‌ఓ బి.వెంకట్ రెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పీస్ కమిటీ తరపున ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు బరకత్ అలీ మిస్రియా,ఎ.లక్ష్మణ్,ముని కుమార్,అవేజ్ మీర్జా,మహ్మద్ ఇస్మాయిల్ పాషా,అబిద్ అలీ,శ్రీనివాస్తో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.