29-07-2024 09:40:34 PM
హైదరాబాద్: ప్రభుత్వ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాల్లో జరుగుతున్న డిజిటల్ ద్వంసంపై సీఎస్ శాంతికుమారి తక్షణమే జోక్యం చేసుకుని వేగవంతంగా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు కోరారు. సోమవారం ఎక్స్‌వేదిక స్పందిస్తూ కేసీఆర్ పాలనలోని ముఖ్యమైన సమాచారం, వివరాలను తొలగించారని, గత ప్రభుత్వం సమాచారం, వివరాలు రాష్ట్ర ప్రజల ఆస్తి, తెలంగాణ చరిత్రలో భాగమని వాటిని కాపాడాలన్నారు. భవిష్యత్తు తరాల కోసం ఈడిజిటల్ సంపదను పరిరక్షించాలని, దానికోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తగిన చర్యలు తీసుకోకపోతే న్యాయ పరంగా ముందుకు వెళ్లుతామని హెచ్చరించారు.