ఇసుక డంపు పట్టివేత
మంథని తహసీల్దార్ కార్యాలయానికి తరలింపు
‘విజయక్రాంతి’ కథనానికి స్పందన
మంథని, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. గత నెల 26న విజయక్రాంతి పత్రికలో ‘ఇసుక దందా.. ఆపేదుందా’ కథనం ప్రచురితం కాగా మంథనిలో ఇసుక దందాపై పోలీస్, రెవెన్యూ అధికారులు నిఘా పెట్టారు. మంథని మండలంలోని మల్లేపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు నిల్వ చేసిన దాదాపు 20 ట్రిప్పుల ఇసుక డంపును మంగళవారం గుర్తించారు. వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆర్‌ఐ రాజిరెడ్డి.. సిబ్బందితో ఇసుక డంపు వద్దకు వెళ్లి పంచానామా చేశారు. ఇసుకను సీజ్ చేసి మంథని తహసీల్దార్ కార్యాలయనికి తరలించారు. మంథని డివిజన్‌లో ఇసుక అక్రమ రవాణా చేస్తే ప్రజలు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆర్‌ఐ కోరారు.




