13 April, 2026 | 11:49 AM

Breaking News

మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం: ట్రక్కు ఢీకొని ఏడుగురు దుర్మరణం   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •   రెడ్డిపల్లి కార్బన్ రిసోర్సస్ సంస్థ వివాదం – హైకోర్టు ఆదేశాలు, అధికారుల అడ్డంకులు   •  

వర్సిటీలను కేసీఆర్ పట్టించుకోలేదు

01-05-2024 12:33 AM

కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ 

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లలేదని, విద్యార్థుల సమస్యలను ఏనాడు పట్టించుకోలేదని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షు డు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. వేసవిలో యూనివర్సిటీల్లోని విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ఇక్కడే ఉంటున్నారని, వారికి మెస్ సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పిస్తోందని ఆయన తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో హాస్టళ్లను మూసివేయాలని సర్క్యూలర్ ఇ చ్చారని బల్మూరి వెంకట్ గుర్తుచేశారు. బాల్క సుమన్ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. యూనివర్సిటీల్లోని సమస్యలపై బీఆర్‌ఎస్ పార్టీ చర్చకు సిద్ధమేనా? అని ఆయ న సవాల్ విసిరారు. ఏ సమస్య వచ్చినా సీఎం రేవంత్‌రెడ్డి, మం త్రులు వెంటనే పరిష్కరిస్తున్నారని తెలిపారు.