12-11-2025 10:09:06 PM
కామారెడ్డి (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నాను. ఇప్పటివరకు ఒక్క బిల్లు ఇవ్వలేదు అంటూ ఓ లబ్ధిదారురాలు ఇంటికి ఫ్లెక్సీ కట్టి నిరసన వ్యక్తం చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం అక్కంపల్లిలో చోటుచేసుకుంది. అక్కంపల్లి గ్రామానికి చెందిన మంగలి ఈశ్వరమ్మ ఇందిరమ్మ ఇంటి పథకం కింద ఇల్లు నిర్మించుకున్నది. ఇంటి నిర్మాణం స్లాబ్ వరకు పూర్తయింది. ఒక్క బిల్లు కూడా అధికారులు సాంక్షన్ చేయలేదని లబ్దిదారురాలు ఈశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేస్తుంది.
అప్పుచేసి బిల్లు వస్తుందని ఒంటరి మహిళ తాను ఇల్లు నిర్మించుకుంటే ఒక బిల్లు కూడా అధికారు లు ఇప్పటివరకు ఇవ్వలేదని అడిగిన వస్తుందంటూ కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్పందించి ఇందిరమ్మ ఇల్లు బిల్లు ఇప్పించాలని ఇంటికి ప్లెక్సీ కట్టి వేడుకుంటుంది. తాను వితంతునని ఒంటరి మహిళలని, భూమిలేని వ్యవసాయ కూలీనని ఫ్లెక్సీలో రాసింది. అధికారులు, నాయకులు మంగలి ఈశ్వరమ్మ ఆవేదనను గుర్తించి ఇందిరమ్మ ఇంటీ బిల్లును ఇప్పటికైనా ఇప్పిస్తారని ఆశిద్దాం.