calender_icon.png 11 December, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోజువారీగా నివేదికలు అందించాలి

11-12-2025 01:36:11 AM

మోర్తాడ్, డిసెంబర్10 (విజయ క్రాంతి):  బాల్కొండ నియోజకవర్గం లోని మోర్తాడ్ మండల కేంద్రంలో గల రైతు వేదిక భవనంలో బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పం చ్, వార్డు సభ్యులకు మోర్తాడ్ మండల ఎన్నికల అధికారి, ఎంపీడీవో తిరుమల, ఆడిట్ ఎన్నికల అధికారి మంజుల దేవి అవగాహన సదస్సు నిర్వహించారు.

ఏ అవగాహన సంచుల్లో ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకే వార్డు సభ్యులు, సర్పంచ్ సభ్యులు ఎన్నికల్లో ఖర్చు చేయాలనేది సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు మించి ఎవరైనా అది ఎన్నికల్లో అధిక డబ్బులు ఖర్చు చేస్తే వారి ఎన్నికలు రద్దు చేస్తామన్నారు.

ఎన్నికల్లో నిల్చున్న అభ్యర్థులు ఫ్లెక్సీలకు గాని, కరపత్రాలకు గాని, ప్రచారాలకు ఉపయోగిస్తున్న వాహనాల, ఇతరత్రా ఎన్నికల ఖర్చులను రోజువారీగా రసీ దులతోపాటు ఖర్చు చేసిన వాటిని అభ్యర్థులు ఎన్నికల ఆడిట్ అధికారికి, లేదా మోర్తాడ్ మండల ఎంపీడీవోకు ఎన్నికల్లో ఖర్చు చేసిన నివేదికను అందజేయాలని ఎన్నికల అధికారి మంజులాదేవి, మోర్తాడ్ మండల ఎంపీడీవో తిరుమల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వివరించారు.