calender_icon.png 11 December, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లను అభినందించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

11-12-2025 01:37:18 AM

వేల్పూర్, డిసెంబర్10 (విజయక్రాంతి): ఏకగ్రీవంగా ఎన్నికైన ఎర్గట్ల మండలం దొంచంద,  మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ని మర్యాద సపూర్వకంగ కలిశారు. ఈ సందర్బంగా వారికీ శుభాకాంక్షలు తెలియజేసి సర్పంచ్ లను మరియు పాలకవర్గం వార్డ్ సభ్యులను సన్మానించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్  రెడ్డి. ప్రజలు ఇచ్చిన అవకాశన్ని సద్వినియోగం చేసుకొని గ్రామభివృద్ధికి నిరంతరం.

కృషి చేయాలనీ ఎమ్మెల్యే వారికీ సూచించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారు ఏర్గట్ల మండలం దొంచంద గ్రామానికి చెందిన పెదకాపుల శ్రీనివాస్ దొంచంద సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కావటంతో వారిని వేల్పూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నూతుల విజయ సర్పంచ్ గా ఉప సర్పంచ్ నూతుల కృష్ణారెడ్డి  పాలక వర్గము ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో వారిని వేల్పూర్ మండలం హనుమాన్ నగర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావటంతో సర్పంచ్ గా నడ్పి మల్లయ్య మరియు ఉప సర్పంచ్ గా మణి, పాలకవర్గం సభ్యులను ఎమ్మెల్యే వేముల సన్మానించారు.